హైదరాబాద్ విజయవాడ హైవేపై అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హృదయ విచారకర ఘటన చోటు చేసుకుంది. పాల ప్యాకెట్ కోసం బైక్ పై తన రెండేళ్ల కొడుకుని తీసుకుని వెళ్తుండగా డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి స్పాట్ లోనే చనిపోగా స్వల్ప గాయాలతో బాలుడు బయటపడ్డాడు. కాగా, తండ్రి మృతదేహం వద్ద కూర్చుని బాలుడు ఏడుస్తుండటం చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడిని ఏపీలోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన శెట్టి కనక ప్రసాద్ (35)గా గుర్తించారు.