Homeహైదరాబాద్latest Newsకూతురును హతమార్చిన తండ్రి

కూతురును హతమార్చిన తండ్రి

ఇదేనిజం, నిజామాబాద్ ప్రతినిధి : అభం శుభం తెలియని చిన్నారిని హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరలో జరిగింది. కన్న తండ్రే కూతురు లక్ష్మి (4)ని గొంతు నలిమి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లూర్ మండలంలోని ధర్మోరా గ్రామానికి చెందిన అరుణ్ గత ఏడాది క్రితం జిల్లా కేంద్రానికి చెందిన సునీతను రెండో వివాహం చేసుకున్నాడు. అరుణ్ మొదటి భార్య కు కూతురు ఉండగా విడిపోయి రెండవ భార్య సునీత ను పెండ్లాడాడు. సునీతకు కూడా మొదటి భర్తకు పుట్టిన లక్ష్మి అనే కూతురు ఉంది. పెళ్లి సమయంలో సునీతతో పాటే లక్ష్మి ని కూడా అరుణ్ ఇంటికి వెంట తెచ్చుకున్నాడు.

ఈ క్రమంలో సునీత వెంట వచ్చిన చిన్నారి లక్ష్మి తన ఇంట్లో వద్దని తరచూ సునీతతో అరుణ్ గొడవ పడేవాడు. ఏవిధంగా నైనా తన భార్యతో వచ్చిన చిన్నారి లక్ష్మిని కడతెేర్చాలని భావించాడు. మూడు నెలల క్రితం ఆ చిన్నారి చెయ్యి విరగ్గొట్టాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పాపను సునీత తల్లి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. దాంతో తన పాపను చూడాలని తీసుకురమ్మని సునీత తన భర్తను కోరింది. ఆమె భర్త అరుణ్ అక్కలు సోని, పద్మ, మొదటి భార్య కవిత కలిసి పాపను తీసుకురావడానికి వెళ్లారు. మధ్యలోనే పథకం ప్రకారం గొంతునులిమి పాపను హత్య చేసి ఇంటికి తీసుకొచ్చారు. ఎండదెబ్బ తగలడంతో స్పృహ తప్పిందని నమ్మించడానికి ప్రయత్నించారు. సునీత తన కూతురు లక్ష్మీ గొంతుకు బలమైన గాయాలతో పాటు రక్తం రావడం చూసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. జిల్లా ఆస్పత్రిలో వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందిందని చెప్పారు. దాంతో సునీత నిందితులపై నిజామాబాద్ లోని మూడో టౌన్ లో ఫిర్యాదు చేసింది. ఎస్సై ప్రవీణ్.. నిందితులు అరుణ్, అతని మొదటి భార్య కవిత, అక్కలు సోనీ, పద్మలపై కేసునమోదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల మృతదేహాన్ని పరిశీలించారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img