గర్భం నివారణ కోసం కండోమ్స్ మాత్రమే కాకుండా మరో విధానం అందుబాటులోకి రానుంది. అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ (NICHD) దీనిపై పరిశోధనలు చేసింది. జెల్ రూపంలో ఉండే ఓ క్రీమ్‌ను భుజాలపై రాసుకుంటే పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందట. ఈ మేరకు NES/T అనే జెల్‌పై చేసిన పరిశోధనలను వెల్లడించారు.
NES/T అంటే నెస్టోరోన్, టెస్టొస్టెరాన్ అనే రెండు ప్రధాన పదార్థాల కలయిక. గర్భం, ఇతర పునరుత్పత్తి విధులను నిర్వర్తించే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ సింథటిక్ వెర్షనే ఈ నెస్టోరోన్. ఈ ఔషధాన్ని పురుషులకు ఇచ్చినప్పుడు, వృషణాల్లో ఉన్న టెస్టోస్టిరాన్ వంటి సంతానోత్పత్తి హార్మోన్ల లెవెల్స్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది. మహిళల్లో గర్భ కారక హార్మోన్ల నియంత్రణకు ఈ నెస్టోరోన్ వంటి ఔషధాలను ఉపయోగిస్తున్నారు.