రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు 75 ఏళ్ల వయసులో మంచి బూస్ట్‌ను ఇచ్చినట్లే కనపడుతున్నాయి. ఈ ఏజ్‌లో ఆయన పడుతున్న కష్టాన్ని చూసి జనం చలించిపోయారు. జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపగలిగారు. పేద, మధ్య, ధనిక, ఉద్యోగ వర్గాలను తనవైపు తిప్పుకోవడమేకాకుండా, జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీ ఇక బాగుపడదన్న సంకేతాలను బలంగా తీసుకెళ్లగలిగారు.