ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా తొలి విజయం నమోదు చేసింది. రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 61వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతానికి టీడీపీ 127, జనసేన 19, బీజేపీ 7, వైసీపీ 21 స్థానాల్లో ముందందజలో ఉన్నాయి.