Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 181.87 పాయింట్లు లాభపడి 76,992.77 వద్ద ముగియగా.. నిఫ్టీ సైతం 66.70 పాయింట్ల లాభంతో 23,465.60 వద్ద స్థిరపడింది. ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభపడగా.. టీసీఎస్ టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, నెస్లే షేర్లు నష్టపోయాయి.