Homeహైదరాబాద్latest Newsభీంరాజ్ పల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

భీంరాజ్ పల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని భీంరాజ్ పల్లి గ్రామంలో గ్రామ దేవత పోచమ్మకు బోనాలను ఘనంగా నిర్వహించారు. గురువారం గ్రామంలో ప్రతి ఇంటి నుంచి బోనాన్ని ఎత్తుకొని ముందుగా మహిళలు ఆలయానికి బయలుదేరారు. దారిలో ఉన్న బొడ్రాయి,సారగమ్మ,మహాలక్ష్మి, పెద్దమ్మ,మైసమ్మ దేవతలకు టెంకాయలు కొట్టారు.అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.శివసత్తుల పూనకాలు,డప్పు చప్పుళ్ళు,యువకుల కేరింతల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు నిర్వహించారు.అనంతరం యాటలు బలిచ్చారు.వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేల చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొమ్మెన కుమార్,మాజీ సర్పంచ్ సుజాత,ఉపసర్పంచ్ దూసరవి,నాయకులు కంది స్వామి,సింగారపు లచ్చయ్య,బొమ్మన వెంకటేశం,రేవెల్ల సత్తయ్య,కంది సత్యనారాయణ,సింగారపు మహేష్,పొట్ట తిరుపతి,సామల జనార్ధన్,రేవెల్లి రాయలింగు,కంది సత్తయ్య,తక్కల్ల గజేందర్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img