Homeహైదరాబాద్latest Newsచిరుత సినిమా హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

చిరుత సినిమా హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

చిరంజీవి వారసుడిగా చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నటుడు రామ్ చరణ్. ఆ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన నేహా శర్మ.. ఈ పేరు కంటే ‘చిరుత’ బ్యూటీ అంటేనే ఎక్కువ మందికి గుర్తు ఉంటుంది. పూరి జగన్నాథ్ ఈ మూవీని తెరకెక్కించారు. నేహాకు కూడా తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. ఈ మూవీ హిట్ కొట్టినా పెద్దగా అవకాశాలు రాలేదు. రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్‌తో ‘కుర్రాడు’ మూవీలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టే సాహసం చెయ్యలేదు.తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రావని కన్ఫార్మ్ చేసుకున్న ఈ బ్యూటీ.. తెలివిగా బాలీవుడ్‌లో తిష్ట వేసింది. అందివచ్చిన అవకాశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.అటు సినిమాలతోపాటు.. ఓటీటీల కోసం రెండు వెబ్ సీరిస్‌ల్లో కూడా నటించింది. ‘ఇల్లీగల్’, ‘షైనింగ్ విత్ శర్మస్’ వెబ్ సీరిస్‌ల్లో నటించింది.తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా తన టాలెంట్ చూపిస్తోంది. అందాల ఆరబోతతో కుర్రాళ్లను చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఆమెకు తన సోదరి ఐషా శర్మ కూడా తోడైంది. ఇద్దరూ తమ గ్లామర్‌తో దుమ్ముదులుపుతున్నారు.నేహా శర్మ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయేన్సర్‌గా రాణిస్తోంది. ఇప్పటికే ఆమెకు 21 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ప్రస్తుతం వివిధ బ్యూటీ, టెక్స్‌టైల్ బిజినెస్‌లు రన్ చేస్తోందని.

Recent

- Advertisment -spot_img