ఇదే నిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన తునికి శేఖర్ (27) అనే యువకుడు యూఏఈ దేశంలోని షార్జాలో ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన జూన్ 22న జరిగింది. అవివాహితుడైన శేఖర్ ‘బీహ్’ అనే కంపెనీలో క్లీనర్ గా పనిచేసేవాడు. సోమవారం (24.06.2024) జగిత్యాలలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఊపిరి సలపని బిజీగా ఉన్నప్పటికీ.. గల్ఫ్ మృతుడి కుటుంబ సభ్యులు సహాయం కోసం రాగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి వెంటనే స్పందించారు. షార్జా నుంచి మృతదేహాన్ని వెంటనే ఇండియాకు పంపాలని దుబాయి లోని ఇండియన్ కాన్సులేట్ కు, విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ కు, సీఎం రేవంత్ రెడ్డికి ‘ఎక్స్’ ద్వారా విజ్ఞప్తి చేశారు.