ప్రభాస్ నటించిన మూవీ ‘ కల్కి 2898 ఏడీ’ జూన్ 27న రిలీజ్ కానుంది. అయితే ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రభాస్ ఫ్యాన్స్‌ను కాస్త బాధపెడుతోంది. అదేంటంటే.. ప్రభాస్ కాలికి అయిన గాయం ఇంకా మానలేదని తెలుస్తోంది. రీసెంట్గా ముంబైలో నిర్వహించిన ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కాలు నొప్పితోనే ప్రభాస్ హాజరైనట్లు తెలుస్తుంది.