తెలంగాణలోని మరో గంట కాసేపట్లో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్, జనగామ, గద్వాల, కామారెడ్డి, హన్మకొండ, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండలో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్లో వర్షంతో పాటు 40కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.