ఇదే నిజం, దేవరకొండ: సేవా రత్న జాతీయ అవార్డు ను పి.ఏ.పల్లి మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన మాద గోవర్ధన్ గౌడ్ అందుకున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి విద్యార్థి దశలో నుండే డా.బి.ఆర్.అంబేద్కర్, స్వామి వివేకానందలను ఆదర్శం గా తీసుకొని సామాజిక సేవా దృక్పథంతో ఉంటూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అయిన చదువు వెలుగు, జన్మభూమి, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, మొక్కల పెంపకం, పల్స్ పోలియో మొదలగు వాటిలో చురుకుగా పాల్గొన్నాడు. కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ మొదలగు అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించాడు. మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం నిర్వాహణ మొదలగు సేవా కార్యక్రమాలతో పాటు ప్రజా ఉద్యమాలలో పాల్గొని ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేసేవాడు. బహుజన సాహిత్య అకాడమీగోవర్ధన్ గౌడ్ సేవలను గుర్తించి సేవా రత్న జాతీయ అవార్డు కు ఎంపిక చేసారు. జూన్ 25 వ తేదీన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 7 వ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధా కృష్ణ గారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది డెలిగేట్స్ హాజరయ్యారు. అవార్డు అందజేసిన వారి తో పాటు బీ .ఎస్ .ఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యం.యం.గౌతం, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ… నా యొక్క సేవలను గుర్తించి అవార్డు అందజేసిందుకు బీ .ఎస్ .ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధా కృష్ణ కి, డా.చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. మేము సద్గురు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించినాము దాని ద్వారా మా యొక్క సేవలను విస్తృతం చేస్తామని తెలిపారు.