ఇదేనిజం, ధర్మారం: ధర్మారం మండలం కటికనపల్లిలో పిచ్చికుక్కలు వీరంగం సృష్టించాయి. సుమారు 100 ఆవులు, గేదెలపై సామూహిక దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి పిచ్చికుక్కల వీరంగం సృష్టించి, పశువులను తీవ్రంగా గాయపరిచాయి. తీవ్ర రక్తస్రావంతో అల్లాడిపోతున్న పశువులకు సకాలంలో స్పందించిన స్థానిక గోపాలమిత్ర రాజేశం సత్వర చికిత్స అందించారు. మండల పశువైద్యాధికారులు, జిల్లా పశువైద్యాధికారి వెంటనే స్పందించి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని కటికనపల్లి పశువుల యజమానులు కోరారు.