భారత క్రికెట్ ఫ్యాన్స్ ఇకపై రోహిత్, కోహ్లీ లేని టీ20 మ్యాచ్‌లు చూడాలి. T20 WC కప్ గెలిచిన అనంతరం రోహిత్, కోహ్లీ పొట్టి ఫార్మాట్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. దీంతో కొందరు కోహ్లీ, రోహిత్ లేని మ్యాచెస్ చూడలేమని కామెంట్స్ చేస్తుండగా.. దిగ్గజాలకు బెస్ట్ వీడ్కోలు దక్కిందని మరికొందరు అంటున్నారు. అయితే ఇకమీదట టీ20ల్లో రోహిత్, కోహ్లీ వారసులుగా ఎవరు ఎదుగుతారనేది వేచిచూడాలి.