ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్స్ డే సందర్భంగా పీపుల్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ చింతోజు రాజారాం డాక్టర్ చింతోజు శంకర్ లు 120 మంది విద్యార్థిని విద్యర్ధులకు 250 నోట్ బుక్స్ పెన్స్ అందించారు అలాగే సిద్దిపేట లైన్స్ క్లబ్ వారు విద్యార్థులకు టై ,బెల్ట్ లు అందించారు . ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మంచిగా చదివి ఊరుకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని దాతలు సూచించారు అలాగే లైన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ రాజారాం శంకరులను శాలువలతో సత్కరించి మెమొంటోను అందించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి , బుచ్చిరెడ్డి,ఆనందం పద్మ షాదుల్ లైన్స్ క్లబ్ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.