ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలంలో ఈ నెల నాలుగున ఎంపీపీ, ఎంపీటీసీల పదవి కాలం ముగియనున్న నేపద్యంలో ఎంపీటీసీలతో కలసి ఎంపీపీ జనగామ శరత్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….సిరిసిల్లా శాసన సభ్యులు కేటీఆర్ సహకారం, అధికారల కృషి, ప్రజల భాగస్వాయంతో ఐదు సంవత్సరాల పాటు మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించగలిగామని వెల్లడించారు. ముఖ్యంగా కాలేశ్వరం నీళ్లను మండలంలోని పలు చెరువులకు తీసుకరావడం సంతోషాన్ని నింపింది. ముఖ్యంగా పార్టీలకతీతంగా అన్ని గ్రామాల ఎంపీటీసీలు అభివృద్ధికి సహకరించారని పేర్కోన్నారు. అంతే కాకుండా అన్ని గ్రామాలలోని ప్రజలతో సంబందాలు పేరుగాయని అన్నారు. రానున్న రోజుల్లో అధికాం ఉన్న లేకున్న ప్రజలకు తమ వంతు సహయ సహకారాలు అందిస్తామని పేర్కోన్నారు. ఐదు సంవత్సరాల పాటు సహయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మండల కో-ఆప్షన్ షాదుల్ పాప, ఎంపీటీసీలు గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, కొండని బాలకిషన్, కంచం ముంజూల, దుబ్బాక స్వేచ్ఛ, రాంచంద్రారెడ్డి, నవీన్. రాజు. తదితరలు పాల్గొన్నారు.