ఇదేనిజం, వెల్గటూర్: సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వెల్గటూర్ మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్ అన్నారు. మంగళవారం రోజున ఎండపల్లి మండలంలోని పాత గూడూరు గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీటిని తొలగించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాఉ. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్ తో పాటు ఎం.ఎల్.హెచ్.పి రవినా, ఏఎన్ఎం వరలక్ష్మి, ఆశ వర్కర్ కృష్ణవేణి, పాల్గొన్నారు.