యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్‌సిరీస్ ఏదైనా ఉందంటే అది ‘మీర్జాపూర్’ మాత్రమే. క్రైమ్ యాక్షన్ జానర్లో వచ్చిన ఈ సిరీస్ రెండు సీజన్లు ప్రేక్షకులను ముఖ్యంగా యువతను విశేషంగా అలరించాయి. ఇప్పుడు ‘మీర్జాపూర్: సీజన్3’ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈనెల 5 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వేదికగా ‘సీజన్3’ స్ట్రీమింగ్ కానుంది.