తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20 వేల ల్యాప్టాప్లు అందించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, నోకియా ప్రతినిధులతో సీఎం చర్చించారు. ల్యాప్టాప్లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.