ఫిన్లాండ్కు చెందిన సోలార్ ఫుడ్స్ అనే స్టార్టప్ సంస్థ అద్భుతం చేసింది. కరెంట్, గాలిని ఉపయోగించి ‘సొలీన్’ అనే ఒక ప్రొటీన్ పౌడర్‌ను తయారుచేసింది. ఈ పౌడర్‌ను మనుషులు ఆహారంగా తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. హైడ్రోజెన్, కార్బన్ డయాక్సైడ్ ద్వారా పెరిగే ఒక రకమైన సూక్ష్మజీవితో ఈప్రొటీన్ పౌడర్‌ను తయారుచేసినట్టు పేర్కొంది.