Ananth Ambani wedding: ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ శుక్రవారం ముంబైలో వివాహం చేసుకోనున్నారు. అనంత్ అంబానీ పెళ్లిలో దాదాపు 3 వేల రుచులు అతిథులకు వడ్డించేందుకు రెడీ అవుతున్నారు. వివాహానికి 10 మందికి పైగా అంతర్జాతీయ చెఫ్‌లను ఆహ్వానించారు. ఇండోనేషియాకు చెందిన కోకోనట్ క్యాటరింగ్ కంపెనీ 100కి పైగా కొబ్బరి వంటలను సిద్ధం చేస్తుంది. మద్రాస్ కేఫ్ నుండి కాశీ చాట్, ఫిల్టల్ కాఫీ కూడా ఉంటాయి. ఇటాలియన్, యూరోపియన్ స్టైల్ ఫుడ్ కూడా అందించబడుతుంది. వివిధ రాష్ట్రాల ప్రత్యేక ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.