ఓ సిటీ బస్సులో దుండగులు రెచ్చిపోయారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌లపై దాడి చేశారు. ఈ ఘటన భోపాల్ లో జరిగింది. ఓ స్టాప్ వద్ద ఆగిన బస్సులోకి ఇద్దరు యువకులు ఎక్కారు. వెంటనే దుర్భాషలాడుతూ డ్రైవర్ పై దాడి చేశారు. కండక్టర్ కల్పించుకొని ఆపే ప్రయత్నం చేయగా అతడిని కూడా కొట్టారు. దాంతో కండక్టర్ వారిపైకి తిరగబడటంతో దుండగులు బస్సు దిగి పారిపోయారు. ఈ ఘటనకు గల కారణం తెలియరాలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.