భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రిటైరైనప్పటికీ ఆస్ట్రేలియా జట్టుపై తనకున్న అభిమానాన్ని మరిచిపోలేదు. లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియా ఛాంపియన్తో నిన్న జరిగిన సెమీఫైనల్లో యువీ 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. భారత్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. యువీ గతంలోనూ ఆస్ట్రేలియా ను ఇలాగే చిత్తు చేశారు. 2000 CT క్వార్టర్ ఫైనల్ లో, 2007WC సెమీస్ లో, అలాగే 2011 WC క్వార్టర్ ఫైనల్స్ లో ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా గెలిచారు.