Homeహైదరాబాద్latest Newsకాసేపట్లో తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం.. రత్నభాండాగారం విశేషాలివే..!

కాసేపట్లో తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం.. రత్నభాండాగారం విశేషాలివే..!

దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. రహస్య గదిలో స్వామివారికి అపార సంపదలు, వజ్రవైఢూర్యాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల రహస్య గది నేడు తెరుచుకోనుంది. అయితే పూరీ జగన్నాథ్ ఆలయ రత్నభాండాగారాన్ని 4 6ఏళ్ల తర్వాత నేడు తెరవనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్థ్ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. అయితే లెక్కింపులో ఎంత మంది పాల్గొంటారు? ఎన్ని రోజులు పడుతుంది? అనే వివరాలు అధికారులు వెల్లడించలేదు.

పూరీ రత్నభాండాగారం విశేషాలివే:
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ సమీపంలో రత్నభాండాగారం చిన్న ఆలయ తరహాలో ఉంటుంది. ఇందులో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రదేవిల ఆభరణాలను భద్రపరిచేందుకు బహరా భాండార్(బయట గది), భితరా భాండార్(లోపలి గది) అనే రెండు గదులు ఉంటాయి. స్వామివారికి ఉపయోగించే ఆభరణాలు బయట గదిలో భద్రపరుస్తారు. అలాగే, ఒడిశాను పాలించిన రాజులు, నేపాల్ పాలకులు ఈ ఆలయానికి విరాళంగా అందజేసిన బంగారు, వెండి, వజ్రాలను లోపలి గదిలో భద్రపరిచారని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img