ఇన్ఫోసిస్ 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 15,000 నుంచి 20,000 ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనునున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనతో రాబోయే IT గ్రాడ్యుయేట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2023లో ఇన్ఫోసిస్ తన కంపెనీ కోసం 50వేల మంది ఫ్రెషర్లను ఎంపిక చేసింది. మరుసటి సంవత్సరం అది భారీగా తగ్గింది. 2024లో అంటే ఈ ఏడాది ఇన్ఫోసిస్ కేవలం 11,900మంది ఫ్రెషర్లను మాత్రమే నియమించుకుంది.