టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను క్రికెటర్ మహమ్మద్ షమీ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్మీడియాలో వార్తలు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ ఇంటర్వ్యూలో ఆ వార్తలను షమీ కొట్టిపారేశారు. సోషల్మీడియాలో నకిలీ వార్తలను వ్యాపి చేయడాన్ని ప్రజలు మానుకోవాలని సూచించాడు. మీమ్స్ వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, కానీ ఆ మీమ్స్ వల్ల హాని కూడా జరుగుతుందని షమీ పేర్కొన్నారు.