Weather Report: తెలంగాణలోని రానున్న మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. అయితే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్, పరిసర ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అధికారులు తెలిపారు.