ప్రపంచంలో ఈ పక్షి చాలా ప్రత్యేకం. ఎందుకంటే దీనిలో ఆడ, మగ గుణాలు కనిపిస్తాయి. వీటిని “గైనండ్రోమోర్ఫ్” అంటారు. అంటే రెండు లింగాలు ఒకే పక్షిలో ఉంటాయి. వందేళ్ళ క్రితం ఇలాంటి పక్షిని గుర్తించారు. ఇప్పుడు అది చనిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయి. గతేడాది ఇలాంటి పక్షినే న్యూజిలాండ్ శాస్త్రవేత్త గుర్తించారు. తాజాగా ఈ వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది.