బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాను ఎవరితో డాన్స్ చేసేందుకు ఇష్టపడతారో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. విక్కీ కౌశల్, హృతిక్ రోషన్లో ఎవరితో డాన్స్ చేసేందుకు ఇష్టపడతారని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె భిన్నంగా సమాధానమిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్తో డాన్స్ చేసేందుకు ఇష్టపడతానన్నారు. ‘‘ఇప్పటికే దేవరలో ఎన్టీఆర్తో ఓ సాంగ్ చేశా. మరోసాంగ్ చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’’ అని చెప్పారు.