ఇదేనిజం, లక్షెట్టిపేట: దేశంలోని బహుజనులంతా ఐక్యం కావాలని ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి పెరుగు తురుపతి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో ఆ సంఘం నూతన ఆడహాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామజికంగా ఎదగడానికి కృషి చేయాలన్నారు. నూతన ఆడహాక్ కమిటీ కన్వీనర్ గా అవునూరి సుగుణకర్, పురోత్తుల ప్రవీణ్, రాపెల్లి రాజేష్, సొల్లు అంజన్న, అవునూరి మురళి, మాలెం రాజేష్, దుర్గం రాములు, కాళ్ళ కమలాకర్ తదితరులను ఎన్నుకున్నారు.