ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో 2 రోజులపాటు తెలంగాణలో వానలు కురవనున్నట్టు హైదారాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలకు మోస్తారుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది.