రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసరాల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మరింత భారం కానుంది. ఆగస్టు 1నుంచి చెప్పుల సంబంధించి కొత్త నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. అప్పటినుంచి తయారు చేసే షూస్, బూట్లు, స్లిప్పర్లు, సాండిల్స్ ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్ స్పష్టం చేసింది. దీంతో వచ్చే నెల నుంచి పాదరక్షల ధరలు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.