కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో క్రమంగా మరణాల సంఖ్య పెరుగుతుంది. గురువారం ఉదయం నాటికి మొత్తం మరణించిన వారి సంఖ్య 287కి చేరింది. ఇంకా 240మంది గల్లంతైనట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధృవీకరించారు. 1,500మందికి పైగా ప్రభావిత ప్రాంతాల నుండి రక్షించబడ్డారు. రెస్క్యూ సిబ్బంది 24గంటలు సెర్చ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్ది మరణాల సంఖ్య ఇంకా పెరుగుతుంది.