అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన మూవీ డార్లింగ్. జూలై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఇప్పుడీ కామెడీ ఎంటర్‌టైనర్ ఓటీటీ ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది. ఆగస్టు 13 నుంచి డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ప్రసారం కానుంది.