బీహార్ సీఎం నీతీశ్‌కుమార్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతాలో పాన్‌షాప్ నడుపుతున్న మొహమ్మద్ జాహిద్(51)ను అరెస్టు చేశారు. అతడు బిహార్ వాసి. సీఏం కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ‘అల్-ఖైదా’ పేరుతో ఈ మెయిల్ వచ్చింది. దీనిని బూటకపు బెదిరింపుగాఅధికారులు తేల్చారు. ఆ మెయిల్‌ను పంపిన మొహమ్మద్ జాహిద్‌ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు.