నేటి సమాజంలో చాలా మంది ప్రేమికుల ప్రవర్తన అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇటీవల రైలు బోగీలపై ఓ ప్రేమికుల అకృత్యాలకు సంబంధించిన వీడియో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ ప్రేమ జంట రైలు బోగీలపై పార్క్ స్టైల్లో వెరైటీగా నడుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొద్దిదూరం నడిచాక పక్కపక్కనే కూర్చుని సరసాలాడుతుండటం కనిపించింది. వాటిని గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.