ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశలు నడుమ.. పారిస్ ఒలింపిక్స్లో భారత్ పోరాటం ఆరు పతకాలతో ముగిసింది. టోక్యో ఒలింపిక్స్లో ఏడు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారుల బృందం పారిస్ ఒలింపిక్స్లో మాత్రం దానిని పునరావృతం చేయలేకపోయింది. ‘పారిస్’లో భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ‘పారిస్’లో భారత్కు 1 రజతం, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలు లభించాయి.
ఒలింపిక్స్ పతక విజేతలు వీరే..
- మనూ భాకర్ (కాంస్యం)
- మనూ భాకర్ – సరజ్జోత్ సింగ్ (కాంస్యం–మిక్స్డ్ టీమ్)
- స్వప్నిల్ కుసాలే (కాంస్యం)
- పురుషుల హాకీ జట్టు (కాంస్యం)
- నీరజ్ చోప్రా (సిల్వర్)
- అమన్ షెరావత్ ( కాంస్యం)
- మొత్తం భారత్ గెలిచిన పతకాల సంఖ్య: 6