సెయింట్ మార్టిన్ అనేది బంగాళాఖాతానికి ఈశాన్య భాగంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది బంగ్లాదేశ్‌కి దక్షిణ కొనను ఏర్పరుస్తుంది. 9 కిలోమీటర్ల పొడవు, 1.2 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఆక్రమించి ఇక్కడ ఎయిర్ బేస్ నిర్మించవచ్చని భావిస్తోందట. ఇదే జరిగితే బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది.