Homeహైదరాబాద్latest Newsఇదంతా వారు చేసున్న కుట్రపూరితమైన చర్య.. కొడుకు అరెస్ట్ పై జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు

ఇదంతా వారు చేసున్న కుట్రపూరితమైన చర్య.. కొడుకు అరెస్ట్ పై జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు

అంబాపురం అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు వైసీపీ నేత జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరితమైన చర్య అని, తన కుటుంబాన్ని రోడ్డుకు లాగేందుకే ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. అటాచ్మెంట్ లో ఉన్న భూములను కొన్నామంటూ తమపై నింద మోపటం పెద్ద బూతు అని అన్నారు. అందరూ కొన్నట్లే తాము భూములు కొన్నామని, భూములు కొన్న సమయంలో పేపర్ ప్రకటనలు కూడా ఇచ్చామని అన్నారు. కొంత కాలం తర్వాత ఆ భూములను వేరొకరికి విక్రయించామని అన్నారు.

Recent

- Advertisment -spot_img