ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్బర్గ్ తన భార్య ప్రిసిల్లా చానుపై తన ప్రేమను వినూత్న రీతిలో చాటుకున్నారు. రోమన్ సంప్రదాయంలో ఆమె శిల్పాన్ని చెక్కించి బహుమతిగా ఇచ్చారు. ఈ విగ్రహాన్ని ఇంటి పెరట్లో ప్రతిష్టించారు. దీనికి సంబంధించిన ఫోటోలను జుకర్బర్గ్ ఇన్స్టా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. ప్రిసిల్లా తన విగ్రహం వద్ద కాఫీ తాగుతూ ఫోటోలు దిగారు. నెట్టింట ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్గా మారాయి.