ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘ కుల బాంధవులు కుటుంబ సమేతంగా శ్రావణమాసంలో వనభోజనాలకు వెళ్లి, పెద్దమ్మ పోచమ్మ మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా శ్రావణమాసం లో వనభోజనాలకు వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని, ఆ తల్లి.. పాడి పంటలు ధన ధాన్యాలు చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటాము అని వారు అన్నారు. అనంతరం మహిళలు పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఇందులో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కూర బిక్షపతి, పప్పుల శ్రీనివాస్, బొందుగుల రాజు, గందె రమేష్, విజయ్ కుమార్, కూర సంతోష్, పప్పుల శ్రీకాంత్, కూర నగేష్, రమేష్, దినేష్, మహిళలు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, కుల బాంధవులు పాల్గొన్నారు.