ఒకగ్లాసు మునగాకు రసంతో రోజును ప్రారంభిస్తే కడుపు ఉబ్బరంగా ఉండడం, మలబద్దకం వంటి సాధారణ జీర్ణసంబంధ సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మునగాకుల టీ కాచుకుని ఉదయాన్నే తీసుకుంటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. మదుమేహం వల్ల కలిగే ఇతర దుష్ప్రభావాలను కూడా నివారిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటిని కూడా పెంచుతుంది. మునగాకుల్లో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత ఏర్పడకుండా నివారిస్తుంది.