ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో పురానీ ఢిల్లీ తరఫున ఆడిన రిషభ్ పంత్ బౌలర్‌గా మారాడు. పురానీ ఢిల్లీ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఢిల్లీ జట్టు 19 ఓవర్లకు 197/7 స్కోరుతో ఉన్నప్పుడు పంత్ బౌలింగ్ వేశాడు. ఈ మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ విజయం సాధించింది. చివరి ఓవర్ లో సౌత్ ఢిల్లీ విజయానికి ఒక పరుగు అవసరం కాగా, చివరి ఓవర్లో రిషబ్ పంత్ బంతిని అందుకున్నాడు. అప్పటికే జట్టు ఓటమి ఖాయమైపోవడంతో.. పంత్ బౌలింగ్ కు దిగి కుడిచేతితో స్పిన్ బౌలింగ్ చేశాడు. కానీ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పంత్ బౌలింగ్‌కు ఎక్కువ సమయం ఇవ్వలేదు. తొలి బంతికే సింగిల్ తీసి మ్యాచ్‌ను ముగించాడు. పంత్ ఒక్క బంతి వేసిన వెంటనే మ్యాచ్ ముగిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.