బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. లిక్కర్ స్కాం కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి సమయం ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ కౌంటర్లపై రీజాయిండర్ వేస్తామని కవిత న్యాయవాదులు తెలిపారు.