‘హైడ్రా’ అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘గతంలో పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు వాటిని కూల్చివేయడం కరెక్టా? దీనికి సర్కార్ కూడా బాధ్యత వహించాలి కదా? తప్పు ఎవరిది? భవంతులు కట్టిన వారిదా? వాటికి అనుమతి ఇచ్చినవారిదా? ప్రభుత్వ అధికారులు చేసిన తప్పులకు ఇప్పుడు జనాల్ని ఇలా శిక్షించడం ఎంత వరకు సమంజసం?’ అని ప్రశ్నిస్తున్నారు.