Homeహైదరాబాద్latest Newsకవిత బెయిల్​ పిటిషన్​ పై సుప్రీం కోర్టులో నేడే విచారణ.. ఢిల్లీకి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు.....

కవిత బెయిల్​ పిటిషన్​ పై సుప్రీం కోర్టులో నేడే విచారణ.. ఢిల్లీకి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు.. బెయిల్ పక్కానా?

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత బెయిల్​ పిటిషన్​ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కవితకు ఈసారి తప్పకుండా బెయిల్​ వస్తుందని అంచనాలున్నాయి. కవిత ఢిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో గత మార్చి 15న అరెస్ట్ అయ్యింది. ఆమె గత ఐదు నెలలుగా తీహార్​ జైలులో ఉంటోంది. ఆమె పై ఇప్పటికే ఛార్జ్ షీట్​ దాఖలైంది. కాగా ఈ కేసుకు సంబంధించి కవిత నేరుగా డబ్బులు తీసుకున్నట్లు ఎక్కడా రుజువు కాలేదు. కవితను ఇప్పడికే ఈడీ, సీబీఐ పలుమార్లు విచారించింది. మరోవైపు కవిత జైలులో పలుమార్లు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

ఇటీవల ఎయిమ్స్ లో చికిత్స కూడా చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో మానవతా దృక్ఫథంలో ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్​ మంజూరు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కవిత తరఫున సుప్రీం కోర్టులో ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఇదే కేసులో ఆప్​ నేత మనీష్ సిసోడియాకు కొద్ది రోజుల క్రితమే సుప్రీం బెయిల్​ ఇచ్చింది. ఈ క్రమంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులకు బెయిల్​ అనేది హక్కు, అని నేరం రుజువు కానప్పుడు ఎక్కువ కాలం జైలులో ఉంచరాదని పేర్కొంది. మరో వైపు సోమవారం బీఆర్​ఎస్ నేతలు కేటీఆర్​, హరీష్​ రావు నేతృత్వంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, నాయకులు ఢిల్లీ బయలుదేరారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్​ రావడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img