ఫ్రీగా కూరగాయలు ఇస్తుండటంతో వాటి కోసం ప్రజలు ఎగబడ్డారు. పెద్దపల్లి కూరగాయల మార్కెట్లో కొద్దిరోజులుగా హోల్ సేల్, రీటైల్ కూరగాయాల వ్యాపారుల మధ్య వివాదం నడుస్తోంది. హోల్‌సేల్ వ్యాపారులు వినియోగదారులకు రిటైల్‌గా కూరగాయలు అమ్ముతుండటంతో తాము నష్టపోతున్నామని రీటైల్ వ్యాపాలు తెలిపారు. దీంతో మార్కెట్‌ను బంద్ చేసి, వినియోగదారులకు ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారు. దీంతో కూరగాయల కోసం ప్రజలు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్ అవుతాయి.