Homeలైఫ్‌స్టైల్‌Pure Honey : స్వచ్ఛమైన తేనెను గుర్తించడం ఎలా.. ?

Pure Honey : స్వచ్ఛమైన తేనెను గుర్తించడం ఎలా.. ?

Pure Honey : స్వచ్ఛమైన తేనెను గుర్తించడం ఎలా.. ?

స్వచ్ఛమైన తెనె(Pure Honey) ఎప్పుడూ ఆకర్షనీయంగా ఉండదు. అలా ఉండే తేనె మంచి తేనె కాదు.

అలా అని నల్లగా ఉన్న తేనె మంచిదై పోదు. మంచి తేనె, ప్రాసెస్‌ చేసిన తేనె.

ఈ రెండింటినీ కనిపెట్టడానికి కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో చూసి తెలుసుకోండి.

మంచి తేనె

– ఇలాంటి తేనె పల్లెటూల్లోనే దొరుకుతుంది. ఎలాంటి మందులు కలుపలి స్వచ్ఛమైన తేనె.

కేజీ తేనె కోసం తేనె టీగలు 90 వేల మైళ్లు ఎగురుతాయి. అంటే భూమిని మూడుసార్లు చుటి వచ్చినట్లే.

వాటి కష్టంతో తయారయ్యే స్వచ్ఛమైన తేనెను వాడాలి.

– తేనెపట్టు నుంచి తీసిన స్వచ్ఛమైన తేనెలో మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది.

ఇది ఎప్పటికీ పాడవదు. దీనికి ఎక్స్‌పైరీ డేట్‌ కూడా ఉండదు. అలా ఉంటే అది ప్రాసెస్‌ చేసి తెనె.

ప్రాసెస్‌ చేసిన తేనె సహజ లక్షణాలను కోల్పోతుంది.

– తేనెలో ప్రక్టోజ్‌, గ్లూకోజ్‌లు ఉంటాయి. అందువల్ల ఇది చక్కెర కంటే తియ్యగా ఉంటుంది.

20 శాతం కంటే తక్కువగా నీరు ఉండడం వల్ల అందులో సూక్ష్మజీవులు పెరిగేందుకు కూడా తావులేదు.

18 శాతం కంటే తక్కువ వాటర్‌ ఉంటే అది స్వచ్చమైన తేనె కింద లెక్క వేసుకోవచ్చు.

దీన్ని ఫ్రిజ్‌లో అసలు పెట్టకూడదు. అలా చేస్తే చక్కెరలా మారిపోతుంది. 

దీన్ని గాలిపోసి సీసాలో పోసి స్టోర్‌ చేసి పెట్టుకోవాలి.

ప్రాసెస్‌ చేసిన తేనె :

– ఎక్స్‌పైరీ డేట్‌లు ఉన్న తేనె సీసాలేవీ స్వచ్ఛమైనవి కాదు.

షాపుల్లో అమ్మే తేనెలో కార్న్‌ సిరప్‌, పిండి, స్టార్చ్‌, డెక్ట్రోజ్‌, ఫ్రిజర్వేటివ్స్‌ వంటి పాడవకుండా చేసే పదార్థాల్ని కలుపుతారు.

ఈ వివరాలన్నీ బాటిల్‌పై రాసి ఉంటుంది. కాబట్టి కొనే ముందు కాస్త జాగ్రత్తగా చదువి కొనుగోలు చేయాలి.

Recent

- Advertisment -spot_img