ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ యాక్టర్లలో ఒకరు బీటౌన్ భామ దీపికా పదుకొనే. రన్ వీర్ సింగ్-దీపికాపదుకొనే దంపతులు త్వరలోనే మొదటి సంతానానికి స్వాగతం పలుకబోతున్నారని తెలిసిందే. ఈ క్రమంలోనే దీపికా పదుకొనే ముంబైలో ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. 11,266 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ ఖరీదు రూ.100 కోట్లని తెలుస్తుంది.