ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్ అందని లబ్దిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెల నుంచి కొత్త వారికి పెన్షన్ అందిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. అయితే కొత్తగా పెన్షన్ పొందాలనుకునేవారు ఈ నెలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారం నుంచి సచివాలయాల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనర్హులను గుర్తించి పెన్షన్లు రద్దు చేయబోతున్నట్లు స్పీకర్ వెల్లడించారు.